కర్ణాటక తరహాలో పవర్ షేరింగ్ లేదు: భట్టి విక్రమార్క
ఢిల్లీ (CLiC2NEWS): కర్ణాటక తరహాలో మా ప్రభుత్వంలో పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని తెలంగాణ డిసిఎం భట్టి విక్రమార్క అన్నారు. మా ప్రభుత్వంలో అందరం కలిసి టీం వర్క్ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే అవకాశం లేదన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లడుతూ.. మూసీ సుందరీకరణ మా ప్రభుత్వ హయాంలోనే పూర్తవుతుందని.. గాంధీ ఘాట్ వరకు సుందరీకరణ జరిగి తీరుతుందన్నారు. రాష్ట్రంలో ఉచిత బస్సుకు మహిళన నుండి మంచి స్పందన ఉందని.. మరో 3 వేల బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రూ. రెండు లక్షలు దాటిన వారికి రుణమాఫి చేయొద్దన్నది మా ప్రభుత్వ విధాన నిర్ణయమన్న ఆయన.. రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫి చేశామన్నారు. సన్న బియ్యం సక్సెస్ అయ్యిందని.. గతంలా పక్కదారి పట్టలేదని డిప్యూటి సిఎం భట్టి తెలిపారు.