ఈ నెల 13న ఉజ్జయిని మహంకాళి బోనాలు..
హైదరాబాద్ (CLiC2NEWS): మహంకాళి బోనాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఉజ్జయిని మహంకాళి బోనాలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం మహంకాళి ఆలయ పరిసరాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లుడాతూ.. ఎంతో చరిత్ర గలిగిన మహంకాళి అమ్మవారకి బోనాలు సమర్పించేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారన్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుండే బోనాలు సమర్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం, శాంతి భద్రతల విషయంలో అదనపు పోలీసు బలగాలను రప్పిస్తున్నామన్నారు. శుక్రవారం అమ్మవారికి ఒడి బియ్యం పోసేందుకు మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయింది.