Tirumala : 590 మంది వేద పండితుల‌కు నిరుద్యోగ భృతి..

తిరుమ‌ల (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిరుద్యోగులుగా ఉన్న వేద పండితుల‌కు నిరుద్యోగ భృతిని ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దేవాదాయ‌శాఖ సంయుక్తంగా నిర్వ‌హించిన స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. స‌మావేశంలో టిటిడి ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు, ఇఒ శ్యామ‌ల రావు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. మొత్తం 590 మంది వేద పండితుల‌కు నెల‌కు రూ.3వేలు చొన్పున ఇవ్వనున్న‌ట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయ‌ణ రెడ్డి వెల్ల‌డించారు.

టిటిడి బోర్డులో అన్య‌త‌స్థులు ఉన్న విష‌యం వాస్త‌వ‌మ‌ని.. బోర్డులో దాదాపు 1000 మంది అన్య‌మ‌త‌స్థులు ఉన్నార‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో విచార‌ణ కొన‌సాగుతోంద‌న్నారు. టిటిడి ప‌రిధిలోని క‌ళాశాల‌లు, పాఠ‌శాలల్లో 192 పోస్టుల భ‌ర్తీపై చ‌ర్చించామ‌ని మంత్రి వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.