రూ.60లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను హత్య చేయించిన అల్లుడు..!
సిద్దిపేట (CLiC2NEWS): జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బీబా డబ్బుల కోసం అత్తను హత్య చేయించాడు అల్లుడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసన్ పల్లి శివారులో ఇటీవల చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 7వ తేదీన పెద్దమాసాన్‌పల్లిలో కారు ఢీకొని ఓ (రామవ్వ) మహిళ మృతి చెందింది. ఆదే రోజు మృతి రాలి అల్లుడు యాక్సిడెంట్‌గా ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు సమయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రామవ్వ అల్లుడు వెంకటేశ్ గతంలో అత్త పేరు మీద పలు రకాల బీమాలు చేయించాడు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. బీమా డబ్బులు సగం ఇస్తానని ఆశ జూపి కరుణాకర్ అనే వ్యక్తితో అత్తను హత్య చేయించాడు. ఈనెల 7న రాత్రివేళ పొలం నుండి రామవ్వను ఒంటరిగా ఇంటికి పంపించాడు. నడుచుకుంటూ వెళుతున్న ఆమెను కారుతో ఢీకొట్టించి హత్య చేయించాడు. దీనికోసం వెంటేశ్ అద్దె కారును తెచ్చి కరుణాకర్‌కు ఇచ్చాడు. సిసి కెమెరా పుటేజి ఆధారంగా కారును, డ్రైవర్ ను గుర్తించామని , నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కరుణాకర్‌ను విచారించాగా ఈ హత్య అల్లుడు వెంకటేశ్ చేయించాడని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మృతిరాలి రు.60 లక్షల ప్రమాద బీమా డబ్బుల కోసం అల్లుడే ఆమెను హత్య చేయించినట్లు నిర్ధారించారు.