ఈ కార్యక్రమానికి నన్నెందుకు పిలిచారా? అని ఆశ్చర్యపోయా: రజనీకాంత్
చెన్నై (CLiC2NEWS): చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్ర కథానాయకుడు రాజనీకాంత్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమానికి తనని ఆహ్వానించడంపై సరదాగా జోకులు వేశారు. ఇలాంటి కార్యక్రమాలకు కమల్ హాసన్ గాని.. శివకుమార్‌ని గాని పిలవాల్సిందన్నారు. ఎందుకంటే వారందరూ ఎంతో మేధావులు.. 75 ఏళ్ల వయస్సులో కూలింగ్ గ్లాసులు పెట్టుకొని స్లో మోషన్లో నడిచే నన్నెందుకు పిలిచారా .. అని ఆశ్చర్యపోయా అంటూ రజనీకాంత్ నవ్వులు పూయించారు.
ఎస్.వెంకటేశన్ రంచించిన వేల్పారి పుస్తకానికి విశేష పాఠకాదరణ లభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజనీకాంత్ మాట్లుడుతూ.. మనం ఏం మాట్లాడాలనేది విజ్ఞానం.. ఎలా మాట్లాడాలనేది ప్రతిభ.. ఎంత మాట్లాడాలనేది స్టేజ్ .. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది అనుభవం నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు అని అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తాను చేసిన వ్యాఖ్యలు ఒకింత వివాదానికి దారితీసిన నేపథ్యంలో ఆచి తూచి మాట్లాడాలనుకుంటున్నానన్నారు. రామకృష్ణ ఆశ్రమం వలన తనకు పుస్తక పఠనం అలవాటుగా మారిందని.. ఇప్పటి వరకు ఎననో గొప్ప పుస్తకాలు చదివానని తెలిపారు. స్నేహితులు చెప్పడం వలన తాన వేల్పారి పుస్తకాన్ని చదవడం ప్రారంభించానని.. ఇప్పటికే 25 శాతం పూర్తి చేశానన్నారు. సినిమా నుండి రిటైర్మెంట్ తీసుకున్నా తర్వాత ఆ పుస్తకం పూర్తి చేస్తానన్నారు. వేల్పారి ఆధారంగా శంకర్ తెరకెక్కించనున్న సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.