Hyderabad: బిసిలకు 42% రిజర్వేషన్లు.. కాంగ్రెస్ విజయం: సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): బిసిలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కాంగ్రెస్ పార్టి విజయమని ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బిసిలకు 42% రిజర్వేషన్లపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ బిసి నేతలు.. శనివారం ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. రిజర్వేషన్ ఫలాలను బిసిలు సద్వినియోగం చేసుకోవాలని.. ఇది కాంగ్రెస్ పార్టి విజయమన్నారు. తెలంగాణలో కులగణన చాలా పకడ్బందీగా చేశామని.. ఇది దేశానికే ఉత్తమ మోడల్ అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా కులగణనకు వివరాలు వెల్లడించారన్నారు. ఈ సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి భద్రపరిచామని సిఎం తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన రెండు బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధిచిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నింటిపై చర్చలు జరిపిర క్యాబినేట్ .. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది.
బిసి రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపిటిసి సభ్యులకు మండలం, ఎంపిపి, జడ్పిటిసి సభ్యులకు జిల్ఆ, జడ్పి ఛైర్మన్లకు రాష్ట్రం .. ఇలా యూనిట్లగా పరిగణిస్తారు. బిసి రిజర్వేషన్లకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం -2018లో చేయాల్సిన సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.