Delhi: రాష్ట్రపతి భవన్లో ‘కన్నప్ప’ సినిమా ..
ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బుధవారం ‘కన్నప్ప’ చిత్రాన్ని ప్రదర్శించారు. సమచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు ఈ చిత్రాన్ని వీక్షించారు. చిత్రంలోని హీరో విష్ణు నటనని కొనియాడారు. ఈ స్పెషల్ షో ప్రదర్శనపై చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన భక్తి చిత్రం కన్నప్ప.. భక్తి, సాంస్కృతిక ప్రాముఖ్యానికి దక్కిన గర్వకారణమని ఈ సందర్బంగా పేర్కొంది. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్‌లాల్ తదితర ప్రముఖ నటులు నటించారు.
