మారుతి సుజుకీ ఎర్టిగా, బాలెనో ధరలు పెంపు..
Maruti : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఎర్టిగా , బాలెనో కార్ల ధరను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు నేటి నుండే అమలులోకి రానున్నాయి. ఈ ఎర్టిగా , బాలెనో మోడళ్ల కార్లలో స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్ బ్యాగులు అందిస్తున్నందుకు వాటి ధరలు పెంచుతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది చివరికల్లా అన్ని పాసింజర్ వాహనాలకు ఆరు ఎయిర్ బ్యాగులను అమరుస్తామని ప్రకటించింది. మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అయిన బాలెనో ధర రూ.6.7 లక్షలు కాగా.. హెఎండ్ వేరియంట్ ధర రూ. 9.92 లక్షలుగా ఉంది. ఎర్టిగా ధర రూ. 8.97 లక్షల నుండి ప్రారంభం నుండి రూ. 13.25 లక్షల వరకు ఉంది.