ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): శుక్రవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద వేగంగా వస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారు మాలోత్ చందూలాల్ , గుగులోత్ జనార్ధన్, కావలి బాలరాజు, జాడ కృష్ణ, దాసరి భాస్కరరావుగా గుర్తించారు.
ఇబ్రహీంపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాజి ఎంపి మాలోతు కవిత జనార్ధన్ మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.