Warangal: మామునూరు ఎయిర్ పోర్ట్‌కు రూ.205 కోట్లు విడుద‌ల‌..

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): వరంగ‌ల్‌లో ఎయిర్‌పోర్టుకు నిధులు విడుద‌ల చేస్తూ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేక‌ర‌ణ నిమిత్తం రూ.205 కోట్లు విడుద‌ల చేసింది. మామునూరు వ‌ద్ద కొత్త బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కె. రామ్మోహ‌న్ రాయుడు మార్చినెల‌లో అనుమ‌తి ఇచ్చారు. ఈ ఎయిర్‌పోర్టుకి అన్ని అనుమ‌తులు ఇస్తూ.. ఎయిర్‌పోర్ట్ అథారిటి (ఎఎఐ) నిర్మాణం ప్రారంభించ‌డానికి వీలుగా సంబంధిత ద‌స్త్రంపై సంత‌కాలు చేశారు. ఈ క్ర‌మంలో మ‌రో 253 ఎక‌రాల భూమిని రాష్ట్ర ప్ర‌భుత్వం సేక‌రించి ఇస్తే కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణం మొద‌లు పెడ‌తామ‌ని కేంద్ర‌మంత్రి ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో భూసేక‌ర‌ణ నిమిత్తం నిధులు విడుద‌ల చేసింది.

Leave A Reply

Your email address will not be published.