కాశ్మీర్‌లో `ఆపరేషన్ మహదేవ్`.. ముగ్గురు ఉగ్రవాదులు హతం..
శ్రీనగర్ (CLiC2NEWS): శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్కు ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రమూకల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ముగ్గురువు ఉగ్రవాదులను హతమార్చినట్లు చినార్ కోర్ వెల్లడించింది. మరణించిన వారు పహల్గాం ఘాతుకానికి పాల్పడిన ఉగ్రమూలకని తీవ్ర ప్రచారం జరుగుతోంది? కాగా దీనిపై ఇప్పటి వరకు చినార్ కోర్ ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు…
కాగా నిఘా వర్గాల సమాచారం మేరకు.. హర్వాన్ ప్రాంతంలో ఉగ్రమూకలు ఉన్నట్లు తెలియడంతో గత నెల రోజులుగా ఈ ప్రాంతంలో భారత్ సైన్యం, సిఆర్‌పి ఎప్ బాలగాలతో ఏర్పడిన `ఆపరేషన్ మహదేవ్` తీవ్ర గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఉన్నట్టుండి భద్రతా దళాలపై ఒక్కసారిగా ఉగ్రమూకలు కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురు దాడికి దిగాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకు మగ్గురు మృతి చెందినట్లు చినార్ కోర్ ప్రకటించింది. ఇంకా ఆ ప్రాంతంలో దాడులు కొనసాగుతున్నాయి.
కాగా ఈ సంవత్సరం ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో ఉగ్రమూకలు మారణ హోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ కాల్పుల్లో 25 మంది పర్యాటకు మరణించిన విషయం విధితమే.