FIDE: మహిళల చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా దివ్య
FIDE Women’s Chess World Cup : ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్‌లో దివ్య దేశ్‌ముఖ్ ఛాంపియన్‌గా నిలిచింది. దివ్య.. ఫైనల్‌లో కోనేరు హంపితో తలపడిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఫైనల్స్ తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగిసింది. రెండో గేమ్‌లో 1.5 పాయింట్లు సాధించి విజయం సాధించింది. దివ్య మొత్తం 75 ఎత్తుల్లో విజయం సొంతం చేసుకుని 2025 ఫిడే మహిళల ప్రపంచకప్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి క్రీడాకారిణి.
ఇప్పటి వరకు గ్రాండ్ మాస్టర్ హోదా కూడా అందుకోని దివ్య.. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ కప్‌లో తనకన్నా మెరుగైన రేటింగ్ ఉన్న ద్రోణవల్లి హారిక (క్వార్టర్ ఫైనల్), జుజినర్ (ప్రి క్వార్టర్స్) పై నెగ్గి.. సెమీస్‌లో మాజి ప్రపంచ ఛాంపియన్ జుగాయిపై గెలిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోనేరు హంపి తీవ్రమైన పోటీ ఇవ్వడంతో నేడు టై బ్రేకర్‌కు చేరింది. తాజాగా విజయం దివ్యా దేశ్‌ముఖ్‌ను వరించింది. దీంతో దివ్య గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకుంది.
నాగ్‌పుర్‌కు చెందిన నాగ్ దివ్యా దేశ్‌ముఖ్ (19).. 2021 ఇంటర్నేషనల్ హాస్టర్ హోదాను అందుకుంది. 2023లో ఆసియి ఛాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. ఒలింపియాడ్‌లో మూడు పసిడి పతకాలు సాధించింది. గతేడాది తొలిసారి 2500 రేటింగ్ ను అందుకుంది.
మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్.. తలపడిన హంపి, దివ్య దేశ్‌ముఖ్
[…] ఇవి కూడా చదవండి: FIDE: మహిళల చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా … […]