Nagarjuna Sagar Dam: `సాగ‌ర్‌` నీటి విడుద‌ల‌

న‌ల్ల‌గొండ (CLiC2NEWS): ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల మూలంగా కృష్ణా న‌దికి భారీగా వ‌ర‌ద నీరు పోటెత్త‌డంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండు కుండ‌లా మారాయి. భారీగా వ‌ర‌ద నీరు చేర‌డంతో నాగార్జున సాగ‌ర్‌ప్రాజెక్టు (Nagarjuna Sagar Dam)ఫుల్ వాట‌ర్ తో క‌ల‌క‌ల‌లాడుతుంది. ప్రాజెక్టుకు భారీ ఎత్తున ఇన్‌ఫ్లో ఉండ‌టంతో మంగ‌ళ‌వారం సాగ‌ర్ క్ర‌స్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ స‌హా ప‌లువురు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. 590.00 అడుగుల పూర్తి స్థాయి సామ‌ర్థ్యం గ‌ల ప్రాజెక్టులోకి ప్ర‌స్తుతం 586.60 అడుగుల మేర నీరు చేరింది. సాగ‌ర్ గేట్లు ఎత్తిన నేప‌థ్యంలో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

నిండు కుండ‌ల్లా మారిన ప్రాజెక్టులు

గ‌త కొంత కాలంగా తెల‌గు రాష్ట్రాల్లో కురుస్తున్న వ‌ర్షాల‌తో ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టుల‌న్నీ నిండుకుండ‌ల్లా మారాయి. కృష్ణా న‌దికి భారీగా వ‌ర‌ద నీరు చేర‌డంతో శ్రీ‌శైలం గేట్లు ఎత్తి నీటిని వ‌దిలా. అలాగే జారాల ప్రాజెక్టు కు భారీ ఎత్తున ఇన్‌ఫ్లో రావ‌డంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి వ‌దిలారు. తాజాగా నాగుర్జున సాగ‌ర్ ప్రాజెక్టులోకి ప్ర‌స్తుతం 586.60 అడుగుల మేర నీరు చేరింది. దీంతో సాగ‌ర్ గేట్ల‌ను ఎత్తి నీటిని కిందికి వ‌దిలారు. ఈ నేథ్యంలో లోత‌ట్లు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు అధికారులు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

అలాగే ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌తో గోదావ‌రి న‌దికి కూడా భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతోంది. ఈ న‌దిపై ఉన్న ప్రాజెక్టుల్లోకి కూడా భారీ నీరు చేరింది. భ‌ద్ర‌చాలం వ‌ద్ద గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి: హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ రూట్ బ‌స్సు టికెట్ ధ‌ర‌ల్లో త‌గ్గింపు!

Leave A Reply

Your email address will not be published.