హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ రూట్ బ‌స్సు టికెట్ ధ‌ర‌ల్లో త‌గ్గింపు!

టిజిఎస్ ఆర్‌టిసి శుభ‌వార్త

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలిపింది. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ రూట్‌లో ప్ర‌యాణించే ఆర్‌టిసి బ‌స్సుల టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌నుంది. క‌నీసం 16% నుండి గ‌రిష్టంగా 30% వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల్లో ప్ర‌త్యేక ఆఫ‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. దీని ప్ర‌కారం సూప‌ర్ ల‌గ్జ‌రి, ల‌హ‌రి నాన్ ఎసి బ‌స్సుల్లో టికెట్ ధ‌ర‌పై 20%, రాజ‌ధాని, ల‌హ‌రి ఎసి బ‌స్సుల్లో 16%, గరుడ ప్ల‌స్ బ‌స్సుల్లో 30%, ఇ-గరుడ బ‌స్సుల్లో 26% ప్ర‌త్యేక ఆఫ‌ర్ ఇవ్వ‌నుంది. ఈ రాయితీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ బుకింగ్‌ల‌కు వ‌ర్తించ‌నున్నాయి. ఈ టికెట్లు ఆర్‌టిసి వెబ్‌సైట్ http://tgsrtcbus.in ద్వారా కూడా బుక్ చేసుకోవ‌చ్చని సూచించారు.

 

త‌ప్ప‌క చ‌ద‌వండి: వీధి కుక్క‌ల స‌మ‌స్య‌ను సుమోటొగా స్వీక‌రించిన సుప్రీంకోర్టు

 

Leave A Reply

Your email address will not be published.