Tirumala: తిరుమల శ్రీవారికి రూ. 2.4 కోట్ల భారీ కానుక
తిరుమల (CLiC2NEWS): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామికి ఓ సంస్థ భారీ కానుకలు అందజేసింది. మంగళవారం నాడు శ్రీవారికి చెన్నై(Chennai) కి చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజస్ సంస్థ బంగారు కానుకలను అందజేసింది.

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) అదనపు ఇఒ వెంకయ్య చౌదరి సమక్షంలో ఈ కానులను సంస్థ నిర్వాహకులు అందజేశారు.
చెన్నై(Chennai) సంస్థ అందజేసిన శంఖు చక్రాల విలువ రూ. 2.4 కోట్లు ఉంటుందని వారు తెలిపారు. ఈ శంఖు చక్రాలను 2.5 కిలోల బంగారంతో రూపొందించినట్లు వారు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: FIDE: మహిళల చెస్ ప్రపంచ ఛాంపియన్గా దివ్య