డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్: వ‌చ్చేనెల 7న‌ ఎంబిఎ, ఎంసిఎ ప్రవేశ ప‌రీక్ష‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): దూర‌విద్య‌లో ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వాల‌నుకునే విద్యార్థుల‌కు ప్రొఫెస‌ర్ జి. రాంరెడ్డి సెంట‌ర్ ఫ‌ర్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ (పిజిఆర్ ఆర్ సిడిఇ) ప్రవేశ ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తుంది. దీనికోసం వ‌చ్చే నెల 2 వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉస్మానియా యూనివ‌ర్సిటి దూర‌విద్యా కేంద్రం పిజిఆర్ ఆర్ సిడిఇ .. ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. సెప్టెంబ‌ర్ 7వ తేదీన ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు. టిఎస్ ఐసెట్ -2025లో అర్హ‌త సాధించిన వారు ఈ ప‌రీక్ష‌రాయాల్సిన అవ‌స‌రంలేదు. నేరుగా ఈ కోర్సుల్లో ప్ర‌వేశాలు పొంద‌వ‌చ్చు. విద్యార్థులు పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్ www.osmania.ac.in చూడ‌గ‌ల‌రు.

Also Read:  UGC: ఆ కోర్సుల‌కు ఆడ్మిష‌న్స్ ఆపేయండి

 

Leave A Reply

Your email address will not be published.