ఆర్టిసి ప్రయాణికులకు పంద్రాగస్టు ఆఫర్
హైదరాబాద్ (CLiC2NEWS): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రయాణికులకు ఆఫర్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రయాణించే వారికి ట్రావెల్ యాజ్ యు లైక్ (TAYL) టికెట్ ధరను తగ్గించింది. ఇంతకు ముందు పెద్దలకు టికెట్ ధర రూ. 150గా ఉండేది. తాజాగా ఆ ధరను రూ.130కి తగ్గించారు. అదేవిధంగా.. మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు రూ.120 నుండి రూ.110కి తగ్గించారు. పిల్లలకు ఇంతకు ముందు ఉన్న టికెట్ ధర రూ.100 ఉండగా.. దాన్ని రూ.90కి తగ్గించారు. ఈ ఆఫర్ ఆగస్టు 15 నుండి 31 వరకు వర్తిస్తుంది.
మెట్రలో డీలక్స్ బస్సులతో పాటు సిటి ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు టికెట్లను కొనుగోలు చేసే అవకాశం కల్పించారు.
Also Read : ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం..