Cloudburst: జమ్ము కాశ్మీర్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. ఏడుగురి దుర్మరణం
జమ్మూ (CLiC2NEWS): జమ్మూ లోని కిశ్త్‌వాడ్‌లో సంభవించిన క్లౌడ్ బరస్ట్ మరువకముందే ఆదివారం తెల్లవారు జమున మరో ఘటన చోటుచేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా జోడ్ ఘాటి అనే గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఆదివారం తెల్లవారు జామున దాదాపు 4 గంటల సమయంలో ఒక్కసారిగా ఈ క్లౌడ్ బరస్ట్ జరిగిందని స్థానిక పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు. ఇప్పటి కే సహాయక చర్యల కోసం స్థానిక పోలీసులు, ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మిగా తా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అలాగే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

జుతానా జోడ్ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడటంతో శిథిలాల కింద ఓ కుటుంబం చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారిని వెలికి తీసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో కురుస్తున్న భారీ వర్షాలతో సహాక్ ఖాద్, ఉజ్ నదుల్లో వరద విపరీతంగా పెరిగిపోయింది. దాంతో స్థానికంగా రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కథువా పోలీస్ స్టేషన్ లోకి కూడా భారీగా వరదనీరు చేరిందని అధికారులు తెలిపారు..
Spoken to SSP Kathua Sh Shobhit Saxena after receiving information about a cloud burst in the Janglote area.
4 Casualties reported. In addition, damage has occurred to Railway track, National Highway while Police Station Kathua has been affected.
The civilian Administration,…
— Dr Jitendra Singh (@DrJitendraSingh) August 17, 2025
కాగా ఈఘటనపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు మంత్రి ఎక్స్‌లో పోస్టు చేశారు.
Also Read: డిస్టెన్స్ ఎడ్యుకేషన్: వచ్చేనెల 7న ఎంబిఎ, ఎంసిఎ ప్రవేశ పరీక్ష
[…] Cloudburst: జమ్ము కాశ్మీర్లో మళ్లీ క్లౌడ… […]