కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి.. విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తుండగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా రామాంతపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ ఊరేగింపులో రథానికి విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రథాన్ని లాగే వాహనం ఆగిపోయింది. దానికి మరమ్మతులు అవసరం ఏర్పడింది. దాన్ని వదిలేసి యువకులు రథాన్నిచేతులతో లాగుతున్నారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలి 9 మంది కి షాక్ కొట్టింది. దీంతో ఆ తొమ్మిది మంది ఒక్కసారిగి దూరంగా విసిరేసినట్లు పడిపోయారు. వీరందరినీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఐదుగురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన నలుగురికి చికిత్సనందిస్తున్నారు. గాయపడిన వారికిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్ కూడా ఉన్నట్లు సమాచారం.

[…] […]
[…] […]