ఢిల్లీ సిఎంపై దాడి!

న్యూఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీ ముఖ్య‌మంత్రి రేఖాగుప్తా (Rekha Gupta)పై దాడి జ‌రిగింది. బుధ‌వారం త‌న అధికారిక నివాసంలో `జ‌న్ సున్‌వాయ్‌` నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో దాడికి పాల్ప‌డ్డ‌ట్లు భార‌తీయ జ‌న‌తా పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

బుధ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన జ‌న్ సున్‌వాయ్ కార్య‌క్ర‌మంలో 41 యేళ్ల వ‌య‌సుగల వ్య‌క్తి ఫిర్యాదు దారుగా న‌టిస్తున్న కొన్ని పేప‌ర్ల‌ను తీసుకొని సిఎం వ‌ద్ద‌కు వ‌చ్చాడు. తొలుత ఆ పేప‌ర్ల‌ను ముఖ్య‌మంత్రికి అంద‌జేసి అనంత‌రం సిఎంపై దాడికి పాల్ప‌డిన‌ట్లు బిజెపి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

నిందితుడు గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేష్ భాయ్ కింజీ భాయ్ (41)గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసిన‌ట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

కాగా ఈ ఘ‌ట‌న‌పై ఢిల్లీ బిజెపి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు వీరేంద్ర స‌చ్ దేవా మీడియా మీడియాతో మాట్లాడారు… ఈ ఘ‌ట‌న‌తో సిఎం తీవ్ర దిగ్భంతికి లోన‌య్యార‌ని తెలిపారు. ఘ‌ట‌న అనంత‌రం సిఎం రేఖా గుప్తాను చికిత్స కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష నేత, మాజీ ముఖ్య‌మంత్రి అతిషి స్పందించారు. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. ప్ర‌జాస్వామ్యంలో హింస‌కు చోటు లేద‌ని అతిషి తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై డిల్లీ మంత్రి ముంజీంద‌ర్ సింగ్ సిస్రా మీడియాతో మాట్లాడారు. ఈ దాడి ప్ర‌త్య‌ర్థుల కుట్ర కావ‌చ్చ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. హ‌స్తిన ప్ర‌జ‌ల‌కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్న సిఎం పై ఇలా దాడి చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు.

Also read : హైకోర్టులో మాజి సిఎం కెసిఆర్ పిటిష‌న్

Leave A Reply

Your email address will not be published.