గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో 2,778 పోస్టుల భ‌ర్తీకి కేబినేట్ ఆమోదం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో డిప్యుటేష‌న్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న 2,778 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం ఎపి స‌చివాల‌యంలో మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో 33 అజెండా అంశాల‌కు ఆమోదం ల‌భించింది. అధికారిక భాష కమిష‌న్ పేరును ‘మండ‌లి వెంక‌ట కృష్ణారావు అధికారిక భాష క‌మిష‌న్‌’గా మార్పున‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. అంతేకాక‌, ప‌ర్యాట‌క ప్రాజెక్టుల‌కు ప్ర‌భుత్వ భూముల‌ను కేటాయింపు మార్గ‌ద‌ర్శ‌కాల‌కు ఆమోదం తెలిపింది. రాజ‌ధాని ప‌రిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్ల‌తో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

51వ సిఆర్‌డిఎ స‌మావేశం ప్ర‌తిపాద‌న‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సిఆర్‌డిఎ ప‌రిధిలో వివిధ సంస్థ‌ల‌కు భూ కేటాయింపుల‌పై మంత్రివ‌ర్గ ఉప సంఘం సిఫార్సుల‌కు ఆమోదం తెలిపింది.

తోట వెంక‌టాచలం (కాకినాడ‌) లిప్ట్ ఇరిగేష‌న్ కాలువ అభివృద్ది,
క‌డ‌ప మైల‌వ‌రంలో 250 మెగావాట్ల సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టు ఏర్పాటు, చిత్తూరు సిహెచ్‌సిని 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిగా అభివృద్ధి.. దీనిలో 56 కొత్త పోస్టుల మంజూరు ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపింది.

గుంటూరు టిడిపి కార్యాల‌య భూమి లీజు కాల‌ప‌రిమితి పెంపు, ఆదానీ సోలార్ ఎన‌ర్జీకి 200 ఎక‌రాల భూ కేటాయింపు, పంచాయ‌తీరాజ్ చ‌ట్టంలోని ప‌లు సెక్ష‌న్ల చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు ఆమోదం తెలిపింది. ఎపి యాచ‌క నిరోధ‌క చ‌ట్ట‌స‌వ‌ర‌ణ ముసాయిదా బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

 

Job News: పంజాబ్ & సింథ్ బ్యాంకులో 750 పోస్టులు

2 Comments
  1. situs phising says

    Thank you for the good writeup. It in fact was a amusement account it.
    Look advanced to more added agreeable from you! However, how could
    we communicate?

  2. плей фортуна says

    It’s amazing designed for me to have a web page, which is beneficial in favor of my know-how.
    thanks admin

Leave A Reply

Your email address will not be published.