ఎసిబి వలలో వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్.. ఎసిబి అధికారులకు చిక్కారు. ఎసిబి అధికారులు తెలపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. తుర్కయాంజల్‌కు చెందిన ఓ వ్యక్తికి ఉన్న 200 గజాల స్థలం రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ రాజేశ్‌ను కలిశారు. అయితే, ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. వారిద్దరి మధ్య రూ.70 వేలకు బేరం కుదిరింది. దీంతో ప్లాటు యజమాని ఎసిబి అధికారులకు సమాచారం అందించాడు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం డాక్యుమెంట్ రైటర్ రమేశ్.. రూ.70వేలు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. రమేశ్‌ను ప్రశ్నించగా.. సబ్ రిజిస్ట్రార్ సూచన మేరకే డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిపాడు. అధికారులు సబ్‌రిజిస్ట్రార్ రాజేశ్‌తో పాటు రైటర్ రమేశ్‌ను కూడా అరెస్టు చేశారు.
Job News: మిధానిలో 50 అసిస్టెంట్ పోస్టులు