కూక‌ట్‌ప‌ల్లి బాలిక హ‌త్య కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని కూక‌ట్‌ప‌ల్లిలో ఈ నెల 18 (సోమ‌వారం)న‌ ఒంట‌రిగా ఇంట్లో ఉన్న బాలిక హ‌త్య‌కు గురైంది. ఈ కేసు ద‌ర్యాప్తు  చేప‌ట్టిన పోలీసులు నిందితుడిని ప‌ట్టుకున్నారు. బాలిక‌ను హ‌త్య చేసింది ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి అని ద‌ర్యాప్తులో వెల్ల‌డైన‌ట్లు స‌మాచారం. ఇంట్లో చోరీ చేసేందుకు వెళ్లిన బాలుడు.. అక్క‌డ బాలిక ఉండే స‌రికి హ‌త్య చేసిన‌ట్లు గుర్తించారు. చోరీ ఏవిధంగా చేయాలో ముందే పేప‌ర్‌పై రాసుకున్నాడు. అత‌ను రాసుకున్న పేప‌ర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

న‌గ‌రంలోని కూక‌ట్‌ప‌ల్లి సంగీత్‌న‌గ‌ర్‌లో బాలిక హ‌త్య‌కు గురైంది. సంగీత్ న‌గ‌ర్‌లో కుమారుడు, కుమార్తెతో భార్యాభ‌ర్త‌లు నివ‌సిస్తున్నారు. ఆ కుటుంబంలో కుమార్తె ఆరోత‌ర‌గ‌తి చుద‌వుతోంది. తండ్రి బైక్ మెకానిక్ , త‌ల్లి ల్యాబ్ టెక్నీషియ‌న్‌గా విధులు నిర్వ‌హిస్తోంది. సోమ‌వారం కుమారుడిని స్కూల్‌కి పంపించి, అనంత‌రం త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ త‌మ ప‌నుల‌కు వెళ్లిపోయారు. ఆ రోజు కుమార్తెకు సెల‌వు కావ‌డంతో ఇంట్లోనే ఉంది. త‌మ్ముడికి లంచ్‌బాక్స్ తానే తీసుకెళ‌తానని కూడా చెప్పింది. కాగా, మ‌ధ్యాహ్నం 12.30 కుమారుడి స్కూల్ నుండి లంచ్‌బాక్స్ రాలేద‌ని తండ్రికి ఫోన్ వ‌చ్చింది. అత‌ను కుమారుడికి లంచ్ బాక్స్ ఇచ్చేందుకు ఇంటికి వచ్చాడు. త‌లుపులు తీసి చూసేస‌రికి క‌త్తి పోట్ల‌తో బాలిక విగ‌త‌జీవిగా ప‌డి ఉంది.

 

న‌గ‌రంలో ప‌దేళ్ల బాలిక దారుణ హ‌త్య‌!

 

Leave A Reply

Your email address will not be published.