మా అదృష్టాన్ని భార‌త ప్ర‌జ‌ల‌తో పంచుకోవాల‌నుకుంటున్నాం..

మెల్‌బోర్న్ (CLiC2NEWS): భార‌త్‌లో పెట్టుబ‌డులు పెంచేందుకు తామ ఆస‌క్తిగా ఉన్నామ‌ని , వారి అదృష్టాన్ని భార‌త ప్ర‌జ‌ల‌తో క‌లిసి పంచుకోవాల‌నుకుంటున్న‌ట్లు ఆస్ట్రేలియా వాణిజ్య‌మంత్రి డాన్ ఫారెల్ అన్నారు. భార‌త్ కూడా అభివృద్ధి చెందుతున్న దేశ‌మ‌ని, ఆ దేశంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచాల‌నుకుంటున్నామ‌ని అన్నారు. ఈ రెండు దేశాల మ‌ధ్య ఉన్న స‌ర‌ఫరా గొలుసుల్ని మెరుగుప‌ర్చుకుంటామ‌ని ఫారెల్‌ అన్నారు.

భార‌త ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను ఉద్దేశిస్తూ .. డెడ్ ఎకాన‌మి అంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా అస్ట్రేలియా వాణిజ్య మంత్రి ఫారెల్ ట్రంప్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. స్వేచ్చ‌, న్యాయ‌ప‌ర‌మైన వాణిజ్యాన్ని తాము విశ్వ‌సిస్తున్నామ‌ని, అమెరికా విధిస్తోన్న టారిఫ్‌ల‌ను అస్ట్రేలియా స‌మ‌ర్థించ‌బోద‌ని అన్నారు. భార‌త్‌లో పెట్టుబ‌డులు పెంచేందుకు మేం అస‌క్తిగా ఉన్నామ‌ని అయ‌న అన్నారు. ఆ దేశంలో క‌లిసి ప‌నిచేయాల‌నుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. భార‌త్‌లో మాకు గొప్ప అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌న్నారు. దేశంలో ఉన్న మిన‌ర‌ల్స్ , క్రిటిక‌ల్ మిన‌రల్స్ , రేర్ ఎర్త్స్ కార‌ణంగా త‌మ‌ను ల‌క్కీ దేశంగా అభివ‌ర్ణిస్తార‌న్నారు. త‌మ అదృష్టాన్ని భార‌త ప్ర‌జ‌ల‌తో క‌లిసి పంచుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు ఫారెల్ అన్నారు.

రెండు దేశాల మ‌ధ్య స‌మ‌గ్ర ఆర్ధిక స‌హ‌కార ఒప్పందం చ‌ర్చ‌ల నిమిత్తం ఆ దేశ ప్ర‌తినిధిని ఢిల్లీకి పంపిన‌ట్లు తెలిపారు. ఈ ఒప్పందం నిమిత్తం భార‌త వాణిజ్య మంత్రితో మాట్లాడిన‌ట్లు, మ‌రోసారి మాట్ల‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపారు.

USA: మైక్రోసాప్ట్ క్యాంప‌స్‌లో భార‌తీయ యువ సాప్ట్‌వేర్ మృతి

1 Comment
  1. […] Also Read: మా అదృష్టాన్ని భార‌త ప్ర‌జ‌ల‌తో పంచు… […]

Leave A Reply

Your email address will not be published.