ఖరీదైన గణేశుడి విగ్రహాలు (Photos)
గణేశ్ చతుర్ధి సందర్బంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. వాడ వాడలా గణేశుడి మండపాలు వివిధ ఆకారాల గణనాధుడి విగ్రహాలతో, భక్తుల కోలాహలంతో, విద్యుదీప కాంతులతో విరాజిల్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో గణేశుడి విగ్రాహాలు ఆకట్టుకుంటున్నాయి. కొన్ని విగ్రాహాలను బంగారం, వెండి, కరెన్సీ నోట్లతో అలంకరించారు.

దేశంలోనే ధనిక గణేశుడి విగ్రహం.. ముంబయిలోని కింగ్ సర్కిల్‌లో కొలువుదీరిన గణనాథుడు
69 కేజీల బంగారం, 336 కేజీల వెండితో అలంకరణ చేశారు. ఇదంతా దాతలు ఇచ్చినదే. ఈ గణనాథుడికి ప్రతి ఏటా ఇన్సూరెన్స్ కూడా చేయిస్తారు. రూ.474 కోట్లతో ఈ గణేశుడి విగ్రహానికి ఇన్సూరెన్స్ చేయించారు.

గుజరాత్‌లోని సూరత్‌లో కొలువైన గణేశుడు..
25 కిలోల బంగారం మరియు వజ్రాభరణాలతో అలంకరించిన గణేశుడి విగ్రహం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 54 కిలోల వెండి బిస్కెట్లతో ఏర్పాటు చేసిన గణనాథుడు

గుంటూరు జిల్లా మంగళగిరిలో రూ.2.35కోట్ల నోట్లతో అలంకరించిన లంబోదరుడు
Telangana: కామారెడ్డిలో ఘనంగా కుంకుమ పూజలు