ఆధార్.. ఐడి ప్రూఫ్‌గా ఎన్నికల కమిషన్ ఆమోదించాల్సిందే: సుప్రీంకోర్టు
ఢిల్లీ (CLiC2NEWS): ఆధార్.. బిహార్ సమగ్ర ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)లో ఆధార్‌ను కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డుగా పరిగణించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల కమిషన్‌కు సూచించింది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రీయ జనతాదళ్, ఎఐఎంఐఎం ఇతర పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీల ధర్మాసనం విచారణ చేపట్టింది. సోమవారం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ పౌరసత్వానికి మాత్రమే ధ్రువీకరణ కాదని పేర్కొంది. అక్రమ వలస దారుల సమస్యకు అవసరమైన వేళ ఎన్నికల కమిషన్ సదరు ఆధార్ సరైనదేనా అనేది తనిఖీ చేయవచ్చని వెల్లడించింది.
ఎన్నికల కమిషన్ ప్రకటించిన 11 ధ్రువీకరణ పత్రాల జాబితాలో 12వ పత్రంగా ఆధార్‌ను పరిగణించాలని పేర్కొంది. ఇది 1950 నాటికి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగునంగా తీసుకొన్న నిర్ణయమని తెలిపింది. ఈ జాబితాలో పాస్‌పోర్టు, బర్త్ సర్టిఫికెట్ వంటి 11 పత్రాలను ఐడి ప్రూఫ్‌గా ఎన్నికల కమిషన్ స్వీకరిస్తోంది. తమ ఆదేశాలు ప్రజలకు తెలిసేలా ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ప్రదర్శించాలని న్యావవాది ద్వివేదికి సూచించింది.
[…] ఆధార్.. ఐడి ప్రూఫ్‌గా ఎన్నికల కమిష… […]