Melbourne Airport: మ‌ల్లెపూలు తీసుకెళ్లినందుకు రూ.1.14ల‌క్ష‌ల జ‌రిమానా

Navya Nair: మ‌ల‌యాళ న‌టి న‌వ్య నాయ‌ర్‌కు.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వింత అనుభ‌వం ఎదురైంది. ఇటీవ‌ల ఓ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యేందుకు న‌టి ఆస్ట్రేలియా వెళ్లారు. త‌న బ్యాగులో మ‌ల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా రూ.1.14ల‌క్ష‌ల జ‌రిమానా వేశారు. ఘ‌ట‌నానంత‌రం ఈవెంట్‌లో పాల్గొన్న న‌టి.. త‌న‌కు ఎదురైన అనుభ‌వాన్ని తెలిపింది. దీంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. తాను తీసుకొచ్చిన పూలు ల‌క్ష రూపాయాలు ఖ‌రీదైన‌వ‌ని జ‌రిమానా విధించేవ‌ర‌కు త‌న‌కు తెలియ‌లేద‌ని చ‌మ‌త్క‌రించింది.

మెల్‌బోర్న్ విమానాశ్ర‌యంలో బ‌యో సెక్యూరిటి చ‌ట్టాలు అమ‌లులో ఉన్నాయి. పండ్లు, విత్త‌నాలు, తాజా లేదా ఎండిన‌ పూలు, కూర‌గాయ‌లు, సుగంధ ద్ర‌వ్యాలు, ముడి గింజ‌లు, విత్త‌నాలు, పాల ఉత్ప‌త్తులు, తెనె, టీ, బియ్యం, వండిన ఆహారం, పెంపుడు జంతువుల ఆహారం, బ‌ర్ఫీ, ర‌స్ మ‌లై, ర‌స‌గుల్లా, పెడాస్‌, గులాబ్ జామున్‌, మైసూర్ పాక్ వంటి స్వీట్లు, జంతువులు, ప‌క్షుల ఈక‌లు, ఎముక‌లు, చర్మంతో చేసిన జాకెట్లు, బ్యాగులు, దుప్ప‌ట్లు, మూలిక‌లు వంటి వ‌స్తువుల‌పై నిషేధం అములులో ఉంది. అక్క‌డి ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లుగుతుంద‌ని, ప్ర‌జ‌ల‌కు వివిధ ర‌కాల వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌టంతో అస్ట్రేలియా ప్ర‌భుత్వం నిబంధ‌న‌లు పెట్టింది.

పైన తెలిపిన వ‌స్తువుల‌ను తీసుకెళ్ళిన వారికి జ‌రిమానాతో పాటు ఒక్కోసారి జైలు శిక్ష విధించే అవకాశం ఉన్న‌ట్లు స‌మాచారం. విదీశీయులు ఆస్ట్రేలియాకు వెళ్లాలంటే వెంట తీసుకువెళుతున్న వాటి గురించి వివారాలు ముందుగానే అధికారుల‌కు తెలియ‌జేయాల్సి ఉంటుంది. అవి నిషేధిత జాబితాలో ఉంటే అధికారులు వాటిని జ‌ప్తు చేస్తారు. ఎటువంటి జ‌రిమానా విధించ‌రు.

Leave A Reply

Your email address will not be published.