రూ.30కోట్లతో నిర్మిస్తే రూ.200 కోట్లు వసూలు చేసిన చిత్రం
Lokha Chapter 1 Chandra: తెలుగు ప్రేక్షకుల సుపరిచితుడు అయిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన చిత్రం లోక చాప్టర్ 1: చంద్ర (తెలుగులో కొత్త లోక) . ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దుల్కర్ ఈ చిత్రాన్ని రూ.30 కోట్లతో నిర్మిస్తే.. ఇప్పటివరకూ రూ.200 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం పోస్టర్ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో మలయాళ చిత్రంగా ఈ సినిమా నిలిచింది.

ఈ సందర్భంగా ఈ చిత్రంలో నటించిన కల్యాణి ప్రియదర్శన్ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి ఫిమేల్ సూపర్ హీరో సినిమాలో నటించడం గర్వంగా ఉందన్నారు. ఈ సినిమాకు సైన్ చేసినపుడు ఇంతటి విజయం సాధిస్తుందనుకోలేదన్నారు. సినిమా విజయానికి తనతోపాటు చిత్ర టీమ్ అంతా కష్టపడ్డారని ప్రియదర్శన్ చెప్పారు.
Also Read: ఆల్టైమ్ గరిష్టానికి బంగారం ధర
[…] […]