తమిళనాడులో ఎపి యువతిపై పోలీసుల అత్యాచారం
చెన్నై (CLiC2NEWS): కాపాడాల్పిన పోలీసులే కాటేసిన ఘటన తమిళనాట చోటుచేసుకుంది. ఎపికి చెందిన ఓ యువతిని తన సోదరి ఎదుటే ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారం చేశారు. ఆ ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…
ఎపికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆటోలో పండ్లు తీసుకుని వెళ్లుండగా ఏందల్ రింగ్ రోడ్డు వద్ద సురేష్, సుందర్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆపారు. అనంతరం ఆటోలో ఉన్న ఇద్దరు యువతులను ఓ తోటలోకి తీసుకెళ్లి సోదరి ఎదుటనే అక్కపై అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలు తిరువణ్నామలై ప్రభుత్వాసుపత్రిలో చికిత్సకోసం చేరారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీలసు కేసు నమెదు చేసి ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. ఈ ఘటన మీడియాలో రావడంతో దర్యాప్తు చేయడానికి వేలూరు రేంజ్ డిఐజి తిరువణ్నామలై కి వెళ్లారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read : రేపు, ఎల్లుండి తెలుగురాష్ట్రాలకు భారీ వర్ష సూచన