రేపు, ఎల్లుండి తెలుగురాష్ట్రాలకు భారీ వర్ష సూచన
హైదరాబాద్ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రేపు, ఎల్లుండి (గురు, శుక్రవారాలు) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడి గురువారం తెల్లవారు జామున వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దాంతో 3వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోని అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో దసరా రద్దీ
[…] […]