`మొంథా` ముప్పు: కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం
విశాఖపట్టణం (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ రాత్రిలోపు పశ్చిమ బంగాళాఖాతంలో తుఫానుగా మారనుందని తెలిపింది. ఈ మొంథా తుఫాను మచిలీపట్నం- కలింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఎల్లుండి (మంగళవారం) తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 90-110 కి. మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
[…] […]