క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదం.. మృత‌దేహాలను బంధువుల‌కు అప్ప‌గింత‌

క‌ర్నూలు (CLiC2NEWS): క‌ర్నూలులో బ‌స్సు మంట‌ల్లో కాలిపోయిన ప్ర‌మాదంలో 19 మంది ప్ర‌యాణికులు ద‌హ‌నమైన విష‌యం తెలిసిందే. అధికారులు ఆ మృత‌దేహాల‌కు డిఎఎన్ ఎ టెస్టులు నిర్వ‌హించారు. ఆ రిపోర్టుల ఆధారంగా ఇప్ప‌టి ర‌కు 18 మృత‌దేహాల‌ను వారి కుటుంభ స‌భ్యుల‌కు అప్పంగించారు. వారికి మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను కూడా అంద‌జేశారు. మృత‌దేహాల‌ను స్వ‌స్థలాల‌కు చేర్చేందుకు అంబులెన్స్ స‌ర్వీసుల‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సిరి ప‌ర్య‌వేక్షించారు.

కాగా ఇప్ప‌టి వ‌ర‌కు 18 మృత‌దేహాల‌ను వారి బంధువుల‌కు అప్ప‌జెప్ప‌గా.. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 19 మంది ద‌హ‌న‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో మ‌రో గుర్తు తెలియ‌ని మృత‌దేహం కోసం చిత్తూరు నుంచి ఒక‌రు వ‌చ్చార‌ని క‌ర్నూలు ఎస్పీ తెలిపారు.

కాగా డిఎన్ ఎ నివేదిక ఆధారంగా ఆ మృత‌దేహం ఎవ‌రిద‌నేది తేలుతుంద‌ని తెలిపారు. కాగా ప్ర‌మాద స‌మ‌యంలో బస్సు డ్రైవ‌ర్ మ‌ద్యం తాగ‌లేద‌ని నివేదిక‌లో తేలింద‌ని ఎస్పీ తెలిపారు.

Also Read: `మొంథా` ముప్పు: కాకినాడ వ‌ద్ద తీరం దాటే అవ‌కాశం

2 Comments
  1. simply says

    Very nice article, exactly what I needed.

Leave A Reply

Your email address will not be published.