కాంగ్రెస్ మేనిఫెస్టో: వరద బాధితులకు రూ.50 వేలు!

హైదరాబాద్‌: గ‌్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఆ పార్టీ నేతలు ఠాగూర్‌, ఉత్తమ్ కుమార్ రెడ్డి‌, భట్టి విక్రమార్క విడుదల చేశారు. వరద బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.2.5 లక్షల నుంచి 5 లక్షల సాయం అందజేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. ఎంఎంటీఎస్‌, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని తెలిపింది. మెట్రో సేవలు పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ పొడిగిస్తామని కాంగ్రెస్‌ పార్టీ వెల్లడించింది. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని వెల్లడించింది. 80 గజాలలోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు అని ప్రకటించింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ లేకుండా చేస్తామని తెలిపింది. ధరణి పోర్టల్ రద్దు, ప్రతి కుటుంబానికి 30 వేల లీటర్ల ఉచిత మంచినీరు అందజేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది.

ఈ సంద‌ర్భంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూసి..నిర్ఘాంత పోయానన్నారు. 2014 నుండి ఇచ్చిన ఏ ఒక్క మేనిఫెస్టోకి సార్థకత లేదని… కేసీఆర్ ది పచ్చి మోసం…దగా అని ఫైర్‌ అయ్యారు. డబుల్ బెడ్ రూమ్ విషయంలో నిసిగ్గుగా మాట్లాడుతున్నారని… గతంలో చెప్పినవి దగా… మోసం మాటలని మండిపడ్డారు. ట్యాంక్ బండ్ లో నీళ్లు కొబ్బరి నీళ్లు చేస్తా అన్నారని… ఇప్పుడు దాని గురించి మాట్లాడడని ఫైర్‌ అయ్యారు. హెయిర్ కటింగ్ సెలూన్ లకు ఉచిత కరెంట్ అని చాలా సార్లు చెప్పాడని… హైదరాబాద్ లో లక్ష ఇండ్లు ఇస్తానని..ఒక్క ఇళ్లయిన ఇచ్చాడా..? అని ప్రశ్నించారు. ఏడేండ్లుగా అధికారంలో ఉండి.. కాలువలు..డ్రైనేజీ ని కూడా సెట్ చేయలేకపోయారని… మూసి ని శుద్ధి చేస్తా అని 2014 నుంచి చెప్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ప్రజలను మోసం చేయడానికేనని అన్నారు. తాగు నీరు ఇన్నాళ్లు ఉచితంగా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మోటార్ వెహికల్ టాక్స్ ఇప్పుడు గుర్తొచ్చిందా..? ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి గుర్తొచ్చాయా..? అని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.