20 యేళ్లుగా ఉచితంగా పాలు, బిస్కెట్లు అందిస్తున్న `పాలతాత`!
మంథని (CLiC2NEWS): ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ పొంది నాటి నుంచి తనకు వచ్చే పింఛను నుంచి కొంత సేవకోసం కేటాయిస్తూ…. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు ఓ పెద్దాయన. సేవే తన జీవిత ధర్మంగా కొనసాగిస్తూ 81 యేళ్ల వయసులో ఆసుపత్రిలోని రోగులకు నిత్యం పాలు, బిస్కట్లు అందిస్తూ సమాజానికి ఆదర్శంగా మారారు.
వివరాల్లోకి వెళ్తే.. పెద్దపెల్లి జిల్లా మంథనికి చెందిన వసంత శర్మ 2002లో తెలుగు ఉపాధ్యాయునిగా పదవీ విరమణ పొందారు. అనాటి నుంచి నేటి వరకు మంథనిలోని తన ఇంటికి సమీపంలోని ప్రభుత్వ వైద్య శాలలో రోగులకు, తన సమీప బంధువులకు ప్రతి రోజూ పాలు, బిస్కెట్లు ఉచితంగా అందిస్తున్నారు.
గత 20 సంవత్సరాలకు పైగా వసంత శర్మ పైసా తీసుకోకుండా, ఎవరి ఆర్థిక సాయం లేకుండా తన పింఛను నుంచి ఖర్చు చేస్తూ సమాజానికి తన వంతు సేవను కొనసాగిస్తున్నారు.
“తనకు ప్రతినెలా వచ్చే పింఛను నుంచి రూ. 15 నుంచి 20 వేల వరకు ఖర్చు చేస్తూన్నానని తెలిపారు. ఇది తనకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని“ తెలిపారు.
Also Read: సుప్రీం కొత్త సిజెఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం
[…] […]