సుప్రీం కొత్త సిజెఐగా జ‌స్టిస్ సూర్య‌కాంత్ ప్ర‌మాణం

న్యూఢిల్లీ (CLiC2NEWS): భార‌త్ అత్యున్న‌త న్యాయ‌స్థానం.. సుప్రీం కోర్టు 53 వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్ ప్ర‌మాణం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఉన్న జ‌స్టిస్ బి.ఆర్‌.గ‌వాయ్ ప‌ద‌వీకాంలో ఆదివారంతో ముగిసింది.. ఈ క్ర‌మంలో సోమ‌వారం జ‌స్టిస్ సూర్య‌కాంత్ చేత రాష్ట్రప‌తి ముర్ము ప్ర‌మాణం చేయించారు. ఈయ‌న 2027 ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ వ‌ర‌కు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప‌రాష్ట్రప‌తి రాధాకృష్ణ‌న్‌, ప్ర‌ధానిమోడీ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కాగా ఈ ప‌ద‌విని స్వీక‌రించిన తొలి హ‌ర్యానావాసిగా జ‌స్టిస్ సూర్య‌కాంత్ రికార్డు ల‌కెక్కారు. జ‌స్టిస్ సూర్య‌కాంత్ హ‌ర్యానాలోని హిస్సార్ జిల్లాలో 1962 ఫిబ్ర‌వ‌రి 10న జ‌న్మించారు. ఈయ‌న 1981లో డిగ్రీ పూర్తి చేశారు. రోహ్‌త‌క్ మ‌హ‌ర్షి వ‌ర్సిటీ నుంచి 1984లో న్యాయ‌విద్య‌ను పూర్తి చేశారు. 2004లో హ‌రియానా హైకోర్టు న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. 2019లో సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తి పొందారు.

Also Read: ఘ‌నంగా స‌త్య‌సాయి శ‌త‌జ‌యంతి వేడుక‌లు

 

Leave A Reply

Your email address will not be published.