టాటా సియారా.. డిసెంబ‌ర్ 16 నుండి బుకింగ్స్ ప్రారంభం

Tata Sierra: టాటా మోటార్స్ నుండి మ‌రో కొత్త వెహిక‌ల్ వ‌చ్చింది. సంస్థ ఐకానిక్ మోడ‌లైన సియారాను మార్కెట్లోకి తీసుకొచ్చింది. డిసెంబ‌ర్ 16వ తేదీ నుండి బుకింగ్స్ ప్రారంభ‌మ‌వుతాయ‌ని.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 15 నుండి డెలివ‌రీలు ప్రారంభం కానున్నట్లు సంస్థ వెల్ల‌డించింది. ఈ ఎస్‌యువి ధ‌ర రూ. 11.49 ల‌క్ష‌లు. టాటా డీల‌ర్ షిప్ వ‌ద్ద గానీ, ఆన్‌లైన్లో గానీ బుకింగ్స్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.

ఇది 5 స్టార్ రేటింగ్ మించిన భ‌ద్ర‌త‌ను క‌లిగి ఉంటుంద‌ని కంపెనీ వెల్ల‌డించింది. ప‌నోర‌మిక్ స‌న్‌రూఫ్‌, ప‌వ‌ర్డ్‌, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ , డ్యూయ‌ల్ జోన్ ఆటోమెటిక్ క్ల‌యిమేట్ కంట్రోల్ వంటి ఫీచ‌ర్స్ ఉన్నాయి. లెవ‌ల్ -2 అడాస్ ప్యాకేజ్ ఉంది . 20 కంటే ఎక్కువ భ‌ద్ర‌తా ప‌ర‌మైన ఫీచ‌ర్లు. ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సియారా పెట్రోల్ డీజిల్ ఇంజిన్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది. 1.5 లీట‌ర్ నాచుర‌ల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ , 1.5 లీట‌ర్ ట‌ర్బోఛార్జెడ్ డైరెక్ట్ ఇంజెక్ష‌న్ పెట్రోల్ , 1.5 లీట‌ర్ డీజిల్ ఇంజిన్ ఆప్ష‌న్లు ఉన్నాయి.

 

Also Read: Election Notification.. పంచాయ‌తీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Leave A Reply

Your email address will not be published.