రైట్స్(RITES) లో 400 అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు

RITES: రైల్ ఇండియా టెక్నిక‌ల్ అండ్ ఎక‌నామిక్ స‌ర్వీస్ లిమిటెడ్ రైట్స్ లో 400 అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేసేందుకు ద‌ర‌ఖాస్తుల‌ను కోరుతున్నారు.

 

సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, సిగ్న‌ల్ అండ్ టెలిక‌మ్యూనికేష‌న్‌, మెకానిక‌ల్, మెట‌ల‌ర్జి, కెమిక‌ల్, ఐటి, పుడ్ టెక్నాల‌జి, ఫార్మా విభాగాల్లో ఖాళీలు క‌ల‌వు. అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. రాత ప‌రీక్ష , ఇంట‌ర్వ్యూ  ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది.

 

ద‌ర‌ఖాస్తుల‌ను డిసెంబ‌ర్ 25వ తేదీలోపు పంపించాల్సి ఉంది.

ద‌ర‌ఖాస్తు ఫీజు జ‌న‌ర‌ల్‌, ఒబిసి అభ్య‌ర్థుల‌కు రూ.600 గా నిర్ణ‌యించారు. ఎస్‌సి, ఎస్‌టి, పిడ‌బ్ల్యుబిడిల‌కు రూ. 300.

 

జ‌న‌వ‌రి 11వ తేదీన రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 42,478 అందుతుంది. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 40 ఏళ్ల‌కు మించ‌రాదు.

 

ప‌రీక్ష కేంద్రాలు,  బెంగ‌ళూరు, చెన్నై,  హైద‌రాబాద్, బిలాయ్‌, భువ‌నేశ్వ‌ర్‌,  కోల్‌క‌తా, ప‌ట్నా, ల‌ఖ్‌న‌వూ, ఢిల్లీ, ముంబ‌యి.

 

ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల‌కు https://www.rites.com/Career వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

 

టాటా సియారా.. డిసెంబ‌ర్ 16 నుండి బుకింగ్స్ ప్రారంభం

1 Comment
  1. […] రైట్స్(RITES) లో 400 అసిస్టెంట్ మేనేజ‌ర్ పో… […]

Leave A Reply

Your email address will not be published.