Kamareddy: సామాజిక అంశాల పై అవగాహన కార్యక్రమం
కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందంచే దేవునిపల్లి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై, టోల్ ఫ్రీ నంబర్1930, టోల్ ఫ్రీ No.8712686094, అత్యవసర సమయంలో డయల్ 100 కాల్ చేయాలని సూచించారు.
అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలు గంజాయి, డ్రగ్స్ సేవించి యువత పెడదారి, మహిళలు, చిన్న పిల్లలపై జరుగు హత్యా నేరాలు, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణ, చిన్న పిల్లలపై జరిగే లైంగిక నేరాలు, మహిళలపై జరిగే నేరాలు, సెల్ ఫోన్స్, యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని విద్యార్థిని, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించి అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ శేషారావు, ప్రభాకర్, సాయిలు, కామారెడ్డి షి టీమ్ సభ్యులు ప్రవీణ్, సౌజన్య, భాను, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

[…] Kamareddy: సామాజిక అంశాల పై అవగాహన కార్యక్ర… […]