ఓరియంటల్ ఇన్‌స్యూరెన్స్ కంపెనీలో 300 పోస్టులు
ఓరియంటల్ ఇన్‌స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులు 300 . వీటిలో జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 285 ఉండగా.. హిందీ ఆఫీసర్ (రాజభాష) పోస్టులు 15 కలవు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.85వేల వేతనం అందుతుంది.
దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1000గా నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్‌టి, పిడబ్ల్యుబిడిలకు రూ. 250 గా ఉంది.
60 శాతం మార్కులతో డిగ్రీ/ పిజి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు నవంబరు 30, 2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://orientalinsurance. org.in/ careers వెబ్‌సైట్ చూడగలరు.
[…] ఓరియంటల్ ఇన్‌స్యూరెన్స్ కంపెనీలో 300… […]