ఇక డిజిటల్ ఓటర్ కార్డులు!
ఎన్నికల సంఘం యోచన..
న్యూఢిల్లీ : డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులను జారే చేసే విషయమై ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. అయితే ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఓ సినియర్ అధికారి చెప్పారు. పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అంతకు ముందే డివిజన్ విధానంలోకి కార్డులను మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే ఇకపై ఓటరు తన గుర్తింపు కార్డును పోలింగ్ స్టేషన్కు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇందులో క్యూకోడ్ ద్వారా సమాచారాన్ని కార్డులో భద్రపరుచనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ విషయంలో ఈసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సదరు అధికారి తెలిపారు. రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, పలు రంగాల అధికారుల నుంచి సలహాలు, ఆలోచనలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డిజిటల్ కార్డు మొబైల్, వెబ్సైట్, ఈ మెయిల్ ద్వారా వేగంగా, తేలికగా గుర్తింపు కార్డులను ఓటరుకు అందించడమే ఉద్దేశమని పేర్కొన్నారు. ఫిజికల్ కార్డు ప్రింట్ చేయడానికి సమయం, ఓటరును చేరుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు. డివిజన్ విధానంలో ఓటరు ఫొటో కూడా స్పష్టంగా ఉంటుందని, తద్వారా గుర్తింపు మరింత సులభతరమవుతుందని వివరించారు. మరో సీరియర్ పోల్ ప్యానెల్ అధికారి మాట్లాడుతూ తుది నిర్ణయం తీసుకునే ముందు భద్రతా అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్పారు.
ఎన్నికల ఖర్చు పరిమితి ఎంతుండాలి?
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్తుల గరిష్ట వ్యవపరిమితి ఎంత ఉండాలని అభిప్రాయం కోరుతూ నమోదిత జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల సంఘం ఈ నెల 7న లేఖలు రాసింది. దీనిపై సలహాలు, సూచనలు కోరింది. అభ్యర్థుల వ్యవపరిమితిపై గత అక్టోబరులో ఏర్పాటైన సమీక్ష సంఘం నోడల్ అధికారికి వాటిని పంపాలని సూచించింది. జాతీయ స్థాయిలో చివరిసారిగా 2014లో అభ్యర్థుల వ్యవపరిమితిని నిర్ణయించారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు దాన్ని 10% పెంచారు. అయితే రాష్ట్రాల పరిమాణాన్ని బట్టి ఈ వ్యయంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, బిహార్, హరియాణా తదితర రాష్ట్రాల్లో లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల ప్రస్తుతం గరిష్టంగా రూ. 77 లక్షలు ఖర్చు చేయవచ్చు. అంతకు ముందు ఇది 70 లక్షలుగా ఉండేది. ఈ రాష్ట్రాల్లో శాసనభ ఎన్నికల్లో పోటీచేసే వారి వ్యవపరిమితి రూ. 28 లక్షల నుంచి 30.8 లక్షలకు పెంచారు.