వైభవంగా జరిగిన అమ్మ గురు భవాని పీఠం 13 వ వార్షికోత్సవం..
రాజమండ్రి: రాజమండ్రి రూరల్ మండలం లోని రాజవోలు గ్రామంలో వెలసిన శ్రీ అమ్మ గురు భవాని అమ్మవారి 13వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ముందుగా కలశపూజలు శాంతి కార్యక్రమాలు హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి అమ్మ గురు భవాని మాట్లాడుతూ అమ్మ వారు తమ పీఠంలో వెలసి నేటికి 12 సంవత్సరాలు పూర్తి అయిందని ఆయన వివరించారు. ఇక నుంచి ప్రతి రోజు నిరుపేదలకు తమ పీఠం లో ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. కేవలం పీఠం వద్దనే కాకుండా మండపేట, రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, పోలవరం వంటి సుదూర ప్రాంతాలకు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఉభయ గోదావరి జిల్లాల నుండి విచ్చేసిన భక్తులకు ఆయన అనుగ్రహ భాషణ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పుర ప్రముఖులు, కొవ్వూరు, నిడదవోలు, మండపేట, ద్రాక్షారామ తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.