AP: ఆర్‌టిసి బస్సు ఆపకపోవడంపై ఎమ్ఎల్ఎ ఆగ్రహం..
పెనమలూరు (CLiC2NEWS): ప్రయాణికులు ఉన్నా సరే బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం లో గురువారం మధ్యాహ్నం కంకిపాడు వైపు నుండి పెనమలూరు వెళుతున్నఎమ్మెల్యే.. కంకిపాడు కూడలిలో బస్సు ఆపకపోవడాన్ని గమనించారు. వెంటనే బస్సు వెనుకే ఫాలో చేసి, ఆ బస్సును ఆపి.. డ్రైవర్, కండక్టర్‌ను మందలించారు. ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రయాణికుల కోసమేనని, బస్సు ఆపకుండా వెళ్లడం కరెక్టు కాదన్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆర్‌టిసి సిబ్బంది వైఖరి బాలేదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని సిబ్బందిని హెచ్చరించారు. ప్రయాణికులు ఉన్న చోట బస్సు ఆపాలని , అదేవిధంగా బస్సులోని ప్రయాణికులకు ఉచిత బస్సు సౌకార్యాన్ని వినియోగించుకోవాలన్నారు.
రూ. 3.5 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అధికారులు..