కరోనా కేసులు.. 25 వేల దిగువకు
24 గంటల్లో 24,010 కొత్త కేసులు.. 355 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 24,010 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,56,558కు చేరింది. ఇందులో 3,22,366 కేసులు యాక్టివ్గా ఉండగా, 94,89,740 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,44,451 మంది కరోనా వల్ల మరణించారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనాబారిన పడినవారిలో 355 మంది మరణించగా, కొత్తగా 33,291 మంది బాధితులు మహమ్మారి బారినుంచి బయటపడ్డారు.
దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 18,86,807 మంది కరోనాబారినపడ్డారు. ఇందులో 48,434 మంది మరణించారు. కర్ణాటకలో 9,04,665 పాజిటివ్ కేసులు రికార్డవగా, ఆంధ్రప్రదేశ్లో 8,76,814 మంది, తమిళనాడులో 8,02,342 మంది, కేరళలో 6,83,440 మంది, ఢిల్లీలో 6,11,994 మంది కరోనాబారిన పడ్డారు. కాగా వరుసగా ఐదురోజులుగా కొవిడ్ మరణాలు 400 దిగువనే నమోదవుతుండటం గమనార్హం.