AP: 5,963 కేసులు.. 27 మరణాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 37,765 మంది శాంపిళ్లను తీసుకుని పరీక్షించగా.. కొత్తగా 5,963 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో 968000 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఆరుగురు, చిత్తూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరులో, వైఎస్ కడప, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించగా, అనంతపురంలో ఒకరు చొప్పున మొత్తం 27 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య7,437 చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 2,569 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 9,09,615 పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 48,053 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.