AP Corona: 6,341 మందికి పాజిటివ్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటలలో 1,07,764 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 6,341 మందికి పాజిటివ్ వచ్చింది. కరోనా బారిన పడి 57 మంది మరణించారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 12,224 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 8,486 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇంకా ప్రస్తుతం 67,629 యాక్టివ్ కేసులు ఉన్నాయి.