గృహహింస, వరకట్న వేధింపులు రూపుమాపడానికి అవగాహన సదస్సు
కాగజ్ నగర్ (CLiC2NEWS): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గృహహింస, వరకట్న వేధింపులు రూపుమాపడానికి సఖి కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి విద్యార్థి మరియు తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని సఖీ సెంటర్ వారు తెలిపారు. కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సఖి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ మహిళలను బాలికలను ఎక్కడైనా ఎవరైనా వేధింపులకు గురిచేస్తే భయపడాల్సిన పని లేదని వెంటనే 100 కి కాల్ చేసి సమాచారం అందించాలని లేదా సఖీ కేంద్రం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా యొక్క ఫోన్ నెంబర్ 8500240181మరియు 181 కి సమాచారం అందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు నిరక్షరాస్యతతో పాటు అవగాహన లేని మూలంగా బాల్య వివాహాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో స్త్రీలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు గృహహింసల నుండి రక్షణ కల్పించడానికి ఈ సఖి కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ సేవలను అందించడానికి సఖి సెంటర్ లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ అడ్మినిస్ట్రేటర్ సౌజన్య, అకౌంటెంట్ మమత, కేస్ వర్కర్ మౌనిక, పారామెడికల్ సత్యశీల, కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జనార్ధన్ అధ్యాపకులు, మహేష్, దత్తాత్రేయ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.