గాజువాక జంక్ష‌న్‌లో డివైడ‌ర్ ను డీ కొన్న బైకు.. ఇద్ద‌రు మృతి

గాజువాక (CLiC2NEWS): విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా గాజువాక జంక్ష‌న్‌లో సోమ‌వారం అర్థ‌రాత్రి రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మ‌దంలో బైక్ మీద ప్రయాణిస్తున్న ఇద్ద‌రు యువ‌కులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. బైక్ వేగంగా వ‌స్తూ అదుపు త‌ప్పి డివైడ‌ర్ ను ఢీ కొంది. ఈ ప్ర‌మాదంలో కూర్మ‌న్న‌పాలెం గ్రామానికి చెందిన అజ‌య్ రాజు (17), మ‌నోజ్ కుమార్ (17) ఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతిచెందారు. పోలీసులు ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. కాగా అతి వేగ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

Alsor Read: నేవీ సిబ్బందితో మోడీ దీపావ‌ళి (Photos)

Leave A Reply

Your email address will not be published.