తిరుమలలో భారీ వర్షం
తిరుమల (CLiC2NEWS): అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో తిరుమల శ్రీవారి ప్రాంగణంతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్వామి వారి దర్శనం, లడ్డూలు, గదుల కోసం వెళ్లే భక్తులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
భారీ వర్షంతో శ్రీవారి ఆలయం ముందు భారీగా వరద నీరు నిలిచిపోయింది. ఘాట్ రోడ్ల వద్ద కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆకాశగంగ, పాప వినాశనం తదితర చోట్లు టిటిడి అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
Also Read : గాజువాక జంక్షన్‌లో డివైడర్ ను డీ కొన్న బైకు.. ఇద్దరు మృతి
[…] తిరుమలలో భారీ వర్షం […]