క‌ర్నూలు జిల్లాలో బ‌స్సు ద‌గ్ధం.. 19 మందికి పైగా మృతి!

క‌ర్నూలు (CLiC2NEWS): ఓ ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు గోర ప్ర‌మాదానికి గురైంది. క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 19 మంది మృతిచెందారు. తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు వెళ్తున్న ఈ బ‌స్సుకు 44వ జాతీయ ర‌హ‌దారిపై ఈప్ర‌మాదం జ‌రిగింది.

శుక్ర‌వారం తెల్ల‌వారు జామున ఈ ప్ర‌మాదం జ‌రిగింది. వెనుక నుంచి వ‌స్తున్న ఓ బైకు బ‌స్సును బ‌లంగా ఢీ కొట్టింది.. ఈ ప్ర‌మాదంలో బ‌స్సు ఆయిల్ ట్యాంకు భాగంలోకి బైకు బ‌లంగా దూసుకెళ్ల‌డంతో ఒక్క సారిగా భారీ ఎత్తున మంట‌లు చెల‌రేగాయి.

ప్ర‌మాదం స‌మ‌యంలో బ‌స్సులో మొత్తం 41 మంది వ‌ర‌కు ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు స‌మాచారం. మంట‌లు భారీ ఎత్తున ఎగ‌సిప‌డ‌టంతో ప‌లువురు ప్ర‌యాణికులు బ‌స్సులోనే ద‌గ్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. 12 మంది ప్ర‌యాణికులు మాత్రం స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డిన‌ట్లు స‌మాచారం. 19 మంది మృతిచెందారు.

క‌ర్నూలు న‌గ‌ర శివారులో ఉలింద‌కొండ స‌మీపంలో ఈ ప్ర‌మాదం చోటుచేస‌కుంది. విష‌యం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌మాదంలో బ‌స్సు మొత్తం కాలిపోయింది. ప్ర‌యాణికులో హైద‌రాబాద్ కు చెందిన వారు అధికంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే డ్రైవ‌ర్లు ఇద్ద‌రు పారిపోయారు.

Also Read: ఇక బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలు..!

1 Comment
Leave A Reply

Your email address will not be published.