లండ‌న్‌లో రోడ్డు ప్ర‌మాదానికి గురై ఇద్ద‌రు న‌గ‌ర‌వాసులు మృతి

గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా కారు ప్రమాదం

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లిన హైద‌రాబాద్ విద్యార్థులు రోడ్డు ప్ర‌మాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. 8 నెల‌ల క్రితం లండ‌న్ వెళ్లిన త‌ర్రె చైత‌న్య‌.. గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి వెళ్లి వ‌స్తుండ‌గా కారు ప్రమాదంలో మృతి చెందాడు. అత‌నితో పాటు ఉప్ప‌ల్ కు చెందిన రిషి తేజ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మ‌రో ఐదుగురికి గాయాల‌య్యాయి. వీరికి ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. త‌ర్రె చైత‌న్య నాద‌ర్‌గుల్‌కు చెందిన ఐల‌య్, మంగ‌మ్మ‌ల చిన్న కుమారుడు.

వినాయ‌క ఉత్సవాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకొని 8 మంది స్నేహితులు రెండు కార్ల‌లో నిమ‌జ్జ‌నానికి వెళ్లారు. తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో వీరి కార్లు ఒక‌దానికొక‌టి ఢీకొని ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు స‌మాచారం. వీరంతా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారుగా గుర్తించారు. ఉన్న‌త చ‌దువుల కోసం వెళ్లిన త‌మ పిల్ల‌ల మ‌ర‌ణ‌వార్త విన్న త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.

 

నాలుగేళ్ల స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సమర్ధించిన సుప్రీంకోర్టు

 

Leave A Reply

Your email address will not be published.